మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (18:36 IST)

కన్నబిడ్డను ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసింది.. ఇరుకుగా, అశుభ్రంగా, వెలుతురు లేకుండా?

మాతృప్రేమ ఏంటో తన కుమారునికి చూపించాల్సిన ఆ కన్నతల్లి.. తన 12 ఏళ్ల కుమారుడికి ఏడాది పాటు నరకం చూపించింది. ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసి నరకం చూపించింది. ఈ ఘటన పశ్చిమ అమెరికాకు చెందిన ఉటా రాష్ట

మాతృప్రేమ ఏంటో తన కుమారునికి చూపించాల్సిన ఆ కన్నతల్లి.. తన 12 ఏళ్ల కుమారుడికి ఏడాది పాటు నరకం చూపించింది. ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసి నరకం చూపించింది. ఈ ఘటన పశ్చిమ అమెరికాకు చెందిన ఉటా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక ఈ దారుణానికి పాల్పడిన బ్రాండీ కే జేన్స్ (36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం ఇటీవలే తెలుసుకున్న ఈ బాలుడి తండ్రి అతడిని రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడాది పాటు సరైన తిండీ తిప్పలు లేక బాలుడు చిక్కి శల్యమయ్యాడని, 30 పౌండ్ల బరువు మాత్రమే ఉన్నాడని, కనీసం నిలబడలేకపోతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అతడు కోలుకోవాలంటే చాలా వారాల పాటు చికిత్స పొందాల్సి ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. 
 
ఇంకా చెప్పాలంటే బాలుడిని బంధించిన బాత్రూమ్ చాలా ఇరుకుగా, అశుభ్రంగా ఉందని.. వెలుతురు కూడా లేకుండా.. ఆ బాలుడు నరకం అనుభవించాడు. ఇక బయటినుంచి లోపలి దృశ్యం చూడడానికి, మాట్లాడడానికి వీలుగా వీడియో కెమెరా ఉన్నట్లు సోదరులు తెలిపారు. ఇలా ఆ కన్నతల్లి ఎందుకు చేసిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.