శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:42 IST)

తల్లిదండ్రులు మందలించారు.. పెరట్లో గుహ తవ్వి.. అక్కడే వుండిపోయాడు Video

Cave boy
తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు వారి ఆశలకు విలువ ఇవ్వాలనే థీమ్‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులపై అలిగిన ఓ యువకుడు గుహలోనే నివసిస్తున్నాడు. సాధారణంగా పిల్లలపై తల్లిదండ్రులు కోపం వ్యక్తం చేయడం సహజమే. అలా తిట్టినపుడు పిల్లలు అలుగుతారు. కొంతమంది పిల్లలు ఇంట్లోనుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటారు. 
 
కానీ, స్పెయిన్ కు చెందిన కాంటో అనే యువకుడు కొంత వినూత్నంగా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 2012లో కాంటోని ట్రాక్ సూట్ వేసుకొని బయటకు వెళ్లొద్దని మందలించారని, పెరట్లో గుహ తవ్వడం మొదలు పెట్టాడు. 
 
స్కూల్ నుంచి వచ్చిన తరువాత కూడా ఆ గుహను తవ్వడం చేస్తుండేవాడు. కొన్ని రోజుల తరువాత అతనికి తన స్నేహితుడు ఓ డ్రిల్ మిషన్‌ను ఇవ్వడంతో గుహను తవ్వడం ఈజీ అయింది. గుహలోనే లివింగ్ రూమ్‌, బాత్‌రూమ్‌, టాయిలెట్ రూమ్, ఇంటర్నెట్ సౌకర్యం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ సమయం ఆ గుహలోనే గడుపుతున్నాడు. ఇప్పుడు ఆ గుహ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.