ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (19:06 IST)

డాడీ.. కాపాడాలంటూ అరుపులు, అంతలోనే సొరచేప నోట్లోకి, 20 సెకన్లలో విషాదం

shark fish
ఈజిప్టు దేశ పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ రష్యా కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. సముద్రంలో ఈతకు వెళ్లిన తమ కుమారుడిని కళ్లముందే కేవలం 20 సెకన్లలో షార్క్ (సొరచేప) తినేసింది. డాడీ .. కాపాడు అంటూ కేకలు వేసేలోపే ఆ బాలుడు సొరచేపకు ఆహారంగా మారిపోయాడు. తమ కళ్లముందే బిడ్డను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రష్యాకు చెందిన ఇరవై మూడేళ్ల పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఇందులోభాగంగా ఎర్రసముద్రం తీరంలోని ఓ రిసార్ట్‌లో బస చేసి గురువారం తన ప్రియురాలితో కలిసి ఈత కొట్టాడు. ఇంతలో అక్కడకు వచ్చిన టైగర్ షార్క్ పోపోవ్‌ను సమీపించి అతడిపై దాడి చేసింది. 
 
డాడీ.. నన్ను కాపాడు అంటూ అతను కేకలు వేశాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ షార్క్ నుండి తప్పించుకోలేకపోయాడు. ఆ యువకుడ్ని షార్క్ నమిలి మింగేసింది. ఆ శరీరంతో రెండు గంటల పాటు ఆడుకుంది! అయితే ప్రియురాలు షార్క్ నుండి తప్పించుకుంది.
 
కళ్లముందే తన కొడుకును తినేయడంతో తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఇతర పర్యాటకులు కూడా వణికిపోయారు. తాము రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌‍కు వెళ్లామని, ఆ సమయంలో తన కొడుకును షార్క్ అటాక్ చేసిందని, ఇదంతా కేవలం సెకన్ల వ్యవధిలో జరిగిందని మృతుని తండ్రి చెప్పాడు. 
 
తన కొడుకును కేవలం 20 సెకండ్లలోనే ఆ షార్క్ నమిలి తినేసిందని, అతనిని నీళ్లలోకి తీసుకు వెళ్లిందని చెప్పాడు.