1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రపంచ వేదికపై రష్యా ప్రతినిధిని చితక్కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ

ukraine mp attack
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య గత యేడాది ఫిబ్రవరి నెలలో యుద్ధం మొదలైంది. ఇది ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రపంచ వేదికపై రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో రష్యా ప్రతినిధి ప్రాణభయంతో పరుగులు తీశాడు. అయినప్పటికీ వదిలిపెట్టకుండా వెంటపడిమరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
టర్కీలోని అంకారాలో బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ర మారికోవస్కీ ఈ సమావేశంలో మాట్లాడుతుండగా, రష్యా ప్రతినిధి వేదికపైకి వచ్చి ఉక్రెయిన్ దేశ జాతీయ జెండాను లాక్కుని వెళ్లాడు. 
 
దీంతో ఆగ్రహించిన ఉక్రెయిన్ ఎంపీ... రష్యా ప్రతినిధిపై దాడి చేశాడు. తమ జాతీయ జెండాను తిరిగి తీసుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని అడ్డుకున్నారు. కాగా, ఈ రెండు దేశాల మధ్య గత 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది.