ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (08:58 IST)

మూవింగ్ ఫ్లైట్‌లో నుంచి దిగి... 'Do you Love me' అంటూ మహిళా పైలట్ల 'కికి' డ్యాన్స్ (వీడియో)

ఇప్పటివరకు కార్లకు పరిమితమైన కికి డ్యాన్స్ ఇపుడు విమానాలకు కూడా పాకింది. రోడ్డుపై కారు నెమ్మదిగా వెళుతుంటే కారు దిగి తమకు నచ్చిన పాటకు డాన్స్ చేసి తిరిగి కారులోకి వెళ్ళతారు. దీన్నే కికి డాన్స్ అంటారు.

ఇప్పటివరకు కార్లకు పరిమితమైన కికి డ్యాన్స్ ఇపుడు విమానాలకు కూడా పాకింది. రోడ్డుపై కారు నెమ్మదిగా వెళుతుంటే కారు దిగి తమకు నచ్చిన పాటకు డాన్స్ చేసి తిరిగి కారులోకి వెళ్ళతారు. దీన్నే కికి డాన్స్ అంటారు. ఇపుడు ఈ వైరస్ విమానాల పైలట్లకు సైతం పాకింది.
 
మెక్సికోలో ఓ చార్టెడ్ విమానం నడుస్తూ ఉండగా, డోర్లు తీసుకుని బయటకు వచ్చిన ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేస్తూ, విమానం వెంట సాగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 
 
విమానాన్ని ఆన్ చేసి, అది రన్‌ వే పై నెమ్మదిగా ముందుకు సాగుతుండగా, కాక్‌పీట్‌లో నుంచి బయటకు లేచి వచ్చిన ఓ మహిళా పైలట్, విమానంలోని మరో యువతి దర్జాగా మెట్లు దిగి, డాన్స్ మొదలు పెట్టారు. దీన్ని వీడియో తీసిన వారు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. 
 
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం హర్షణీయం కావని కొందరు అభిప్రాయపడుతుంటే.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలంటూ వారు నిలదీస్తున్నారు.