గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (11:43 IST)

జేబులో నుంచి పొగలు... బయటకు తీయగానే పేలిన రెడ్మీ 4ఏ

ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక

ఇటీవలికాలంలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌లో ఓ స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫ్యాంటు జేబులో నుంచి పొగలు రావడాన్ని గమనించి.. తక్షణం బయటకుతీసి పక్కకు విసిరివేయగానే ఢమాల్ అంటూ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే రెడ్మీ 4ఏ అనే మోడల్‌ మొబైల్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం కూరగాయల మార్కెట్‌‌లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు.
 
అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన చిట్టిబాబు.. వెంటనే పక్కన పడేశాడు.. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్‌ పేలిపోయింది. ఈ ఘటనసైన సెల్‌‌ఫోన్‌ కంపెనీ ఫిర్యాదు చేశాడు. 
 
చైనా మొబైల్ తయారీ కంపెనీ అయిన షియోమీకి చెందిన స్మార్ట్ ఫోన్లు ఇటీవల విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.