గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (05:44 IST)

అమెరికా- ఇరాన్ యుద్ధంతో మనకేంటి?

ఇరాన్ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ, ఇరాక్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబు అల్ ముహందిస్ను అమెరికా అంతమొందించినందున పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

సులేమానీ, ముహందిస్ మరణానికి బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినందున.. తాజా పరిస్థితులు ఏ మారణహోమానికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి.

ఒకవేళ అమెరికా- ఇరాన్లు కయ్యానికే కాలుదువ్వితే.. భారత్కు కలిగే నష్టాలేమిటో? వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొత్త ఏడాది ప్రారంభమైంది. 2018లో అణు ఒప్పందం రద్దుతో మొదలైన అమెరికా-ఇరాన్ వివాదం.. తాజాగా ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ, ఇరాక్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబు అల్ ముహందిస్ మరణంతో మరింత వేడెక్కింది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అగ్రరాజ్య దళాలు జరిపిన డ్రోన్ దాడిలో ఇరువురు నేతలు ప్రాణాలు కోల్పోయారు. సులేమానీ, ముహందిస్ మరణానికి బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సంకేతాలిచ్చినందున అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

మరోవైపు ఇరాన్పై అమెరికా తదుపరి చర్యలు యుద్ధానికి ఆరంభంలా కాకుండా ముగింపు పలికేలా ఉంటాయని ట్రంప్ ప్రకటించినందున ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి.