గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (15:18 IST)

అమెరికాలో సిక్కు బాలికపై విద్వేష వ్యాఖ్యలు, ‘లెబనాన్‌కు వెళ్లిపో’ అంటూ దూషణ

అమెరికాలో ఓ సిక్కు-అమెరికన్‌ బాలికపై శ్వేతజాతీయుడొకరు విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆమెను మధ్యప్రాచ్యానికి చెందిన బాలికగా పొరబడి.. ‘నీవు ఈ దేశానికి చెందిన దానివి కాదు. తిరిగి లెబనాన్‌కు వెళ్లిపో’ అంటూ బిగ

అమెరికాలో ఓ సిక్కు-అమెరికన్‌ బాలికపై శ్వేతజాతీయుడొకరు విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆమెను మధ్యప్రాచ్యానికి చెందిన బాలికగా పొరబడి.. ‘నీవు ఈ దేశానికి చెందిన దానివి కాదు. తిరిగి లెబనాన్‌కు వెళ్లిపో’ అంటూ బిగ్గరకా కేకలు వేశాడు. న్యూయార్క్‌లోని సబ్‌వే ట్రైన్‌లో ఈ నెల మొదటివారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
దక్షిణాసియా మూలాలున్న వారిపై విద్వేష దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన ప్రాముఖ్యం సంతరించుకొంది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు రైలులో వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తితనపై బిగ్గరగా అరుస్తూ విద్వేష వ్యాఖ్యలు చేశారని న్యూయార్క్‌టైమ్స్‌కు బాధిత బాలిక రాజ్‌ప్రీత్‌ హెయిర్‌ చెప్పారు. తాను ఇండియానాలోనే పుట్టానని వివరించారు. ఈ ఘటనపై రైలులోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు.