ఆ మహిళకు ఎంత గుండె ధైర్యం : సింహం ముందు నృత్యం!!

lion - woman
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 4 అక్టోబరు 2019 (13:06 IST)
సాధారణంగా సింహాన్ని చూస్తేనే హడలిపోతుంటాం. అలాంటిది సింహం ముందు నిలబడి నృత్యం చేసే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, న్యూయార్క్‌కు చెందిన ఓ ఏకంగా సింహం ఎదుట నిలబడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉండే బ్రాంక్స్ జూకు వెళ్లింది. ఆమె సింహాలను తీక్షణంగా చూసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌కు వెళ్లిపోయింది. ఈ దుస్సాహసానికి ఆ మహిళ ఒడిగట్టడంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికిలోనయ్యారు.

సింహాల జోనులోకి వెళ్లిన ఆ మహిళ... నేరుగా ఓ సింహానికి ఎదురుగా నిలబడింది. కొద్దిసేపు డ్యాన్స్ చేసింది. దీన్ని హెర్నెన్‌ రేనోసో అనే వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది కొన్ని క్షణాల్లోనే వైరలైంది.

అయితే, ఆ మహిళ తీరును ప్రతి నెటిజన్ తప్పబట్టారు. ఇదే ఆనందం అంటూ విమర్శించారు. మరోవైపు, ఆ మహిళ చేసిన పనిని తీవ్ర నేరంగా పరిగణించిన న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇంతకీ ఆమె అక్కడ నుంచి తిరిగి ఎలా బయటపడిందన్నదీ తెలియరాలేదు.

దీనిపై మరింత చదవండి :