ముక్కోణపు సిరీస్‌లో మరో రికార్డు.. శ్రీలంక కెప్టెన్ అదుర్స్
ముక్కోణపు సిరీస్‌లో మరో రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ పరాస్ ఖడ్కా శతకంతో చెలరేగి అరుదైన ఫీట్‌ను సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సాధించగా, రోజు వ్యవధిలోనే మరో రికార్డు నమోదైంది. మహిళల జట్టు నుంచి శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు కూడా మూడంకెల స్కోరును సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచారు.
ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్ చమరి ఆటపట్టు (66బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో మెరిశారు. అయితే ఆమె ఒంటరి పోరాటం చేసిన లంక 41 పరుగులుతో ఓటమి పాలైంది.
అంతకుముందు రోజు అంతర్జాతీయ టీ20 ఫార్మట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్ ఖడ్కా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఖడ్కా తర్వాత చమరి ఆటపట్టు శతకం సాధించడంతో టీ20ల్లో మరో రికార్డు చేరింది. అలాగే ఈరెండు జట్ల తరుపున కూడా శతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.