తల్లిని ముక్కలుగా నరికి.. ఫ్రిజ్‌లో నిల్వవుంచి అమ్మేసిన మహిళ.. ఎక్కడ?
ఓ మహిళ తన పక్కింటి వ్యక్తి దగ్గరుండి సెకండ్‌హ్యాండ్‌లో ఓ ఫ్రిజ్‌ని కొనుగోలుచేసుకుంది. కొనుకున్న ఫ్రిజ్‌ని తీసుకుని ఇంటి కెళ్లింది. తీరా ఇంటికి తీసుకెళ్లి దాన్ని తెరిచి చూడగానే.. ఆమెకు దిమ్మదిరిగిపోయింది. ఫ్రిజ్ తెరవగానే అందులో శవం కన్పించింది. వినడానికే భయంకరంగా ఉండే ఈ ఘటన అమెరికాలోని ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే.... నార్త్‌కరోలినాలోని గోల్డ్‌బారోకు చెందిన ఓ మహిళ తమ పక్కింటి నుంచి వాడిన ఫ్రిజ్‌ను సెకండ్‌హ్యాండ్‌కు కొనుగోలు చేసింది. ఫ్రిజ్ అమ్మిన వ్యక్తి ఇప్పుడే దాన్ని తెరవవద్దని కొంత సమయం తర్వాత దాన్ని ఓపెన్‌చేసి వాడుకోమని చెప్పింది. ఆమె ఎందుకు అలా చెప్పిందో ఈ మహిళకు అప్పుడు అర్థం కాలేదు. దీంతో ఆ మహిళ చెప్పినట్టుగానే ఫ్రిజ్‌ను అక్కడ ఓపెన్ చేయకుండానే ఇంటికి తీసుకువచ్చింది. ఫ్రిజ్‌లోపలుండే వస్తువులను సైతం కొనుగోలు చేసింది.
కొద్ది సేపు తర్వాత ఫ్రిజ్ తెరవగా.. అందులో మృతదేహం భాగాలు కన్పించాయి. దీంతో ఆ మహిళకు భయంతో నోటమాట రాలేదు. అనంతరం తేరుకుని 911 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. మనిషి శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచడాన్ని చూసి నివ్వెరపోయింది. దీంతో ఒక్కసారిగా షాకింగ్‌కు గురైన మహిళ పోలీసులకు జరిగిన విషయం అంతా వివరించింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫ్రిజ్‌ను తెరిచిచూడగా అందులో ఉన్నవి మనిషి శరీర భాగాలేనని నిర్ధారించారు. ఆ మృతదేహం ఫ్రిజ్ అమ్మిన మహిళ తల్లిదేనని బాధిత మహిళ అనుమానం వ్యక్తం చేసింది. వృద్ధురాలైన తల్లి కూతురు వద్దే గత కొంతకాలంగా ఉంటుందని అయితే గత సెప్టెంబర్ నెల నుంచి కనిపించడం లేదని వెల్లడించింది. కాగా ఫ్రిజ్ అమ్మిన వ్యక్తి అప్పటికే ఇంటిని వదిలి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.