గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (16:19 IST)

తాలిబ‌న్ కీల‌క నేతను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఎక్కడ..?

ఆప్ఘనిస్థాన్‌లో జనం జడుసుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది జ‌రిగిన రెండ్రోజుల‌కు తాలిబ‌న్ కీల‌క నేతను టోలో న్యూస్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ ఛాన‌ల్ న్యూస్ యాంక‌ర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంక‌ర్ ఇంట‌ర్వ్యూ చేసింది్ట. ఆ యాంకర్ ప్రస్తుతం అరెస్టయినట్లు తెలుస్తోంది. 
 
అదీ కూడా ఈ ఇంట‌ర్వ్యూ పూర్త‌య్యి ప్ర‌సారం జ‌రిగాక ఆ యాంకర్ మాయం అయింది. తాజా స‌మాచారం ప్ర‌కారం, ఆ మ‌హిళా యాంక‌ర్ దేశం విడిచి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది.  మ‌హిళ‌ల‌కు ఆఫ్ఘ‌న్‌లో ర‌క్ష‌ణ లేద‌ని, తాలిబ‌న్లు చెప్పిన మాట‌పై నిల‌బ‌డ‌తార‌నే గ్యారెంటీ లేద‌ని, అందుకే తాను దేశం విడిచి వెళ్లిన‌ట్టు సీఎన్ఎన్‌కు తెలిపింది.  
 
అయితే, ఇచ్చిన మాట‌పై తాలిబ‌న్లు నిల‌బ‌డి మ‌హిళ‌ల‌కు గౌర‌విస్తూ వారికి స‌మాన హ‌క్కులు క‌ల్పిస్తే త‌ప్ప‌కుండా తిరిగి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు వెళ్తాన‌ని బెహెస్తా పేర్కొంది.