పెరుగు ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్‌లో తెరిస్తే.. 12 అడుగుల కొండ చిలువ కనిపించింది...
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు ప్యాకెట్ తీసుకునేందుకు ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేసిన ఓ మహిళకు భయానక దృశ్యం కనిపించడంతో విస్తుపోయింద
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు ప్యాకెట్ తీసుకునేందుకు ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేసిన ఓ మహిళకు భయానక దృశ్యం కనిపించడంతో విస్తుపోయింది. ఆ ఫ్రిడ్జ్‌లో కొండచిలువ ఒకటి తాపీగా కునుకు తీస్తుండటం చూసి భయంతో పరుగులు తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో పెరుగు కొనుక్కుందామని ఓ మహిళ వెళ్లింది. అక్కడి ఫ్రిడ్జ్‌లో పెరుగు తీసుకుందామని ఫ్రిడ్జ్ తెరిచింది. అంతే అందులో 12 అడుగుల కొండచిలువను చూసి హడలిపోయింది. వెంటనే ఆమె కేకలు వేయడంతో మార్కెట్ సిబ్బంది పరుగులు తీసి.. పాములు పట్టే వారిని పిలిపించి లోపలున్న కొండచిలువను బయటకు లాగారు. దాన్ని జాతీయ పార్కులో సురక్షితంగా వదిలారు.
అయితే కొండచిలువ చల్లగా ఉన్న ఫ్రిడ్జ్‌లో మత్తుగా నిద్రపోతోతుండటం వల్ల మహిళకు ప్రమాదం తప్పింది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఇది ఆఫ్రికన్ రాక్ కొండచిలువని, చాలా ప్రమాదకరమని పాము పట్టడానికి వచ్చిన వారు పేర్కొన్నారు. మనుషుల్ని ఊపిరి ఆగకుండా చుట్టేసి చంపేస్తాయన్నారు.