టాయిలెట్ రంధ్రంలో దాగిన పాము... సరిగ్గా మలవిసర్జన సమయంలో చూసి...
కొన్ని సమయాల్లో పాములు గృహావాసాల్లోకి వస్తున్నాయి. అలాంటి పాములు ఇళ్లలోకి ప్రవేశించి.. మరుగు ప్రదేశాల్లో తిష్టవేస్తున్నాయి. ముఖ్యంగా, వంట గదులు, బాత్రూమ్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు వంటి ప్రదేశాల్లో ఉంటున్నాయి. ఇక్కడ ఓ పాము ఏకంగా టాయిలెట్ రంధ్రంలోకి వెళ్లి దాక్కుంది. ఇది చూడని ఇంటి యజమాని మల విసర్జనకు వెళ్లాడు.. సరిగ్గా మలవిసర్జన సమయంలో ఆ పాము బుసలు కొడుతూ పైకి వచ్చింది. అంతే.. ఆ యజమాని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగుపెట్టాడు. ఈ ఘటన టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టెక్సాస్ నగరానికి చెందిన పేటన్ మలోన్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్నపాము టాయిలెట్ సీటు (రంధ్రం)లోకి దూరింది. తీరా మలవిసర్జన సమయంలో ఇది తలపైకెత్తి అటూ ఇటూ చూడసాగింది. అంతే.. ప్రాణభయంతో యజమాని పరుగు లంఘించాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 మిలియన్ల మంది వీక్షించారు.