సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (19:03 IST)

విషమంగానే గానగంధర్వుడు ఎస్.పి. బాలు ఆరోగ్యం...

టాలీవుడ్ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు.. గత కొన్ని రోజులుగా ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో లైఫ్ సపోర్టును అమర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. 
 
ఈ క్రంలో బాలు చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి బుధవారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 'కరోనాతో ఎంజీఎం హెల్త్ కేర్‌లో చేరిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ఒక ఎక్స్‌పర్ట్ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది' అని హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.