బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi

కోహ్లీ లేకుంటేనేమీ.. డివిలియర్స్ ఉన్నాడుగా.. నో ప్రాబ్లమ్: డేనియల్ వెట్టోరీ

ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన కోహ్లీ.. కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన కోహ్లీ.. కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడి.. నాలుగో టెస్టు దూరమైన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మిస్సయితే జట్టును నడిపేందుకు ఏబీ డివిలియర్స్ సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ స్పష్టం చేశారు. ఏప్రిల్ రెండో తేదీ నాటికి కోహ్లీ జట్టులోకి వచ్చి చేరుతాడని భావిస్తున్నట్లు వెట్టోరీ అన్నారు. 
 
డాక్టర్లు, ఫిజియోలతో మాట్లాడిన తరువాతే కోహ్లీ ఆడటంపై ఓ నిర్ణయానికి వస్తామని అన్నాడు. కోహ్లీ అందుబాటులో లేకుంటే డివిలియర్స్ నేతృత్వంలో ముందుకు వెళతామని చెప్పాడు. కాగా ఐపీఎల్-10 ప్రారంభ మ్యాచ్‌ బెంగళూరు- హైదరాబాద్‌ల మధ్య జరుగునున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుబోయాయి.