మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi

ఐపీఎల్-10.. ఏప్రిల్ 4న ప్రారంభోత్సవాలు.. డుమిని, బ్రావో ఔట్

ప్రతిష్టాత్మక ఐపీఎల్ పదో సీజన్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. కానీ ఐపీఎల్‌ల

ప్రతిష్టాత్మక ఐపీఎల్ పదో సీజన్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌-బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. కానీ ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లకు గాయలతో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటికే క్రేజున్న ఆటగాడు కోహ్లీ ఐపీఎల్‌-10కు దాదాపు నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదే తరహాలో గాయం కారణంగా ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో కీలక ఆటగాడైన డుమిని ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అదే జట్టులో మరో ఆటగాడు డీకాక్‌ను గాయం వేధిస్తోంది. దీంతో డీకాక్‌ ఐపీఎల్‌లో పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టు ఆటగాడు డారెన్‌ బ్రావో సోమవారం నిర్వహించిన ప్రాక్టీసు జట్టులో గాయపడ్డాడు.