ఐపీఎల్‌లో ఆడటం నా అదృష్టం.. ముగ్గురు దిగ్గజాలతో ఆడటం?: తాహిర్
ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాంటి వాళ్లనే ఖరీదు చేయకపోవడంతో ఆశలు వదులుకున్నా.. అయితే సన
ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాంటి వాళ్లనే ఖరీదు చేయకపోవడంతో ఆశలు వదులుకున్నా.. అయితే సన్‌రైజర్స్ తనను కొనుగోలు చేసిందని తెలిసి హ్యాపీగా ఫీలయ్యానని తాహిర్ అన్నాడు.
క్రికెట్ స్టార్లు వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్, కోచ్ టామ్ మూడీ లాంటి దిగ్గజాల పర్యవేక్షణలో ఆడే గొప్ప అవకాశం లభించిందన్నాడు. మురళీధరన్ నుంచి మెళకువలు నేర్చుకోవాలని ఉందని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావడం తన అదృష్టమని రషీద్ హర్షం వ్యక్తం చేశాడు.
ఆప్ఘనిస్థాన్‌లో ఆడుకునేందుకు అనుకూలంగా పరిస్థితులు లేవని.. కానీ కుటుంబ సభ్యులు, బోర్డు సహకారంతో తన కలను నెరవేర్చుకున్నట్లు రషీద్ తెలిపాడు. అక్కడి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.