రూ.200 వాచ్ కోసం బేరమాడిన క్రికెటర్.. ఎవరతను?

శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:50 IST)
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా? ఇతడో స్టార్ క్రికెటర్. తన కెరీర్‌లో కోట్లు సంపాదించాడు. కానీ చివరకు చెన్నై మహానగరం వీధుల్లో తిరుగుతూ ఫూట్‌పాత్‌పై అమ్మే ఓ వాచ్ కోసం బేరమాడుతూ కనిపించాడు. చివరికి రూ.200 విలువ చేసే వాచ్‌ను రూ.180కి కొన్నాడు. ఇంతకీ ఈ క్రికెటర్ ఎవరు? అతను ఎందుకు ఫుట్‌పాత్‌పై వస్తువులు కొన్నాడో మీరు కూడా ఓ లుక్కేయండి.. ఇతని పేరు మాథ్యూ హేడెన్. 
 
ఆస్ట్రేలియా తరపున సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో హేడెన్ కూడా ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో భాగంగా తొలి మూడేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరపున ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ కోసం మరోసారి ఇండియా వచ్చాడు. 
 
ఈ సందర్భంగా తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు లుంగీ కట్టుకొని, ఓ నకిలీ గడ్డం, మీసం తగిలించుకొని.. చెన్నైలోని టీ.నగర్ స్ట్రీట్ మాల్‌లో షాపింగ్ చేసాడు. ఇంతకీ అతను ఎందుకు అలా సీక్రెట్ షాపింగ్ చేసాడో మీకు తెలుసా? లెజెండరీ ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ హేడెన్‌కు ఓ సవాలు విసిరాడు. 
 
అందులో భాగంగా చెన్నైలో రూ.1000లోపు ఉన్న వస్తువులు కొనాలన్నది ఆ ఛాలెంజ్. దీంతో హేడెన్ వెంటనే టీ.నగర్‌కు వెళ్లిపోయాడు. అక్కడ వెయ్యిలోపు విలువున్న లుంగీలు, షర్ట్‌లు, వాచ్‌లు కొన్నాడు. హేడెన్‌కు స్థానిక యువకుడు ఒకడు షాపింగ్ చేయడంలో సహాయం చేసాడు. ఓ వాచీ కోసం బేరమాడుతున్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో హేడెన్ పోస్ట్ చేసాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నీ చూడండి

జూలై 22, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments