ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:38 IST)

ధోనీనా మజాకా... ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఎందుకు? (video)

ప్రపంచ కప్‌కు ముందు స్వదేశంలో ఐపీఎల్ సీజన్ సందడి ఆరంభంకానుంది. ఈనెల 23వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ పోటీలు మొదలుకానున్నాయి. ఈ సీజన్ ప్రారంభ పోటీల్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగనుంది. అంటే భారత క్రికెట్ జట్టుకు చెందిన కెప్టెన్, మాజీ కెప్టెన్‌ల మధ్య జరిగే సమరంగా దీన్ని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనుంది.
 
ఇందుకోసం డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ ఉన్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
 
కేవ‌లం ఆట‌గాళ్ల ప్రాక్టీస్‌ను చూసేందుకు సుమారు 12 వేల మందికి పైగా ఫ్యాన్స్ మైదానానికి వ‌చ్చిన‌ట్లు చెన్నై ప్రాంఛైజీ పేర్కొంది. ఇక బ్యాట్ తీసుకొని మైదానంలోకి ధోనీ అడుగుపెట్ట‌గానే ధోనీ.. ధోనీ అంటూ కేక‌లు పెట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సీఎస్‌కే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.