Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నేటి నుంచి ఐపీఎల్-14 సీజన్ రెండో దశ పోటీలు ప్రారంభం

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:31 IST)
కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ఆదివారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచే ప్రారంభంకానున్నాయి. 
 
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరగగా.. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌ల్ని అక్టోబరు 15 వరకూ నిర్వహించనున్నారు.
 
కాగా ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 
 
మొత్తంగా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకు అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లికి సహకరించే అవకాశం ఉంది. దాంతో.. టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. 

అన్నీ చూడండి

ఓ ఉగ్రవాదీ... నువ్వు ఎక్కడికు ఎందుకు వచ్చావ్ (వీడియో)

చైర్మన్ పదవి కోసం అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్న టీడీపి మాజీ కౌన్సిలర్

ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు - రాహుల్‌కు సుప్రీంలో ఊరట

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త కాల్చివేత

NO అని రిప్లై ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ: వి.సి సజ్జనార్, ఐపిఎస్

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: డబుల్ ఎలిమినేషన్... మనస్సు విప్పిన చరణ్ మహాదేవ్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

తర్వాతి కథనం
Show comments