ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (19:55 IST)

రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకున్న లక్నో- ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ ధర

Rishabh Pant
Rishabh Pant
మెగా ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించిన పది నిమిషాలకే రిషభ్ పంత్ చరిత్ర లిఖించాడు. 
 
వేలంలో తొలుత పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.20.75 కోట్లు వెచ్చించడానికే సిద్ధమైంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్‌న తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగించింది. 
 
కానీ ఢిల్లీ పంత్ కోసం సాహిసించలేని మొత్తాన్ని లక్నో బిడ్ వేసి సొంతం చేసుకుంది. గతంలో ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు ధర మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు- కేకేఆర్) ఉండేది. కాగా, శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే.