బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (08:57 IST)

భారత్‌వలో 5జీ సేవలు.. ట్రయల్ రన్ సక్సెస్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటాపోటీగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి.

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటాపోటీగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే 4జీ టెక్నాలజీతో దేశీయ టెలికాం రంగం సేవల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
దేశంలో ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, చైనా టెలికాం ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ సంస్థ హువేయి కలిసి 5 జీ నెట్‌వర్క్ ట్రయల్‌ను భారత్‌లో నిర్వహించగా, ఇది విజయవంతమైంది. 5జీ ట్రయల్ విజయవంతమైందని, సెకనుకు 3జీబీ డేటా వేగాన్ని అందుకున్నట్టు ఆ రెండు సంస్థలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొంది. 
 
గురుగ్రామ్‌లోని మనేసర్‌లో ఉన్న ఎయిర్‌‌టెల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ట్రయల్ నిర్వహించినట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. టెస్ట్ విజయవంతం కావడంతో త్వరలోనే భారత్‌లో 5జీ ఈకో సిస్టం అభివృద్ధికి చర్యలు ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ (నెట్‌వర్క్స్) అభయ్ సావర్గోవంకర్ తెలిపారు.