రిలయన్స్ జియో ధన్.. ధనా ధన్‌కు పోటీ.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.399 రీఛార్జ్ చేసుకుంటే?
రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు మరో ప్రైవేట్ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అన్ని విధాలుగా పోటీపడుతోంది. తాజాగా జియో ప్రకటించిన ధన్.. ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటి
రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు మరో ప్రైవేట్ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అన్ని విధాలుగా పోటీపడుతోంది. తాజాగా జియో ప్రకటించిన ధన్.. ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించు కోవాలని ట్రాయ్ సూచించడంతో జియో ఇప్పుడు 'ధన్ ధనా ధన్' అనే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జిబి డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలల పాటు వ్యాలిడిటీ ఉండేలా రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలా వివిధ రకాల ఆకర్షణీయ ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జియోకు ధీటుగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్ టెల్ ప్రకటించనుంది. భారత టెలికాం మార్కెట్‌లో రిలయన్స్ జియో కురిపిస్తోన్న ఆఫర్ల జోరుని తట్టుకొని నిలబడేందుకు ఎయిర్‌టెల్ ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎయిర్‌టెల్ ప్రకటించనున్న ఈ సరికొత్త ప్లాన్ ప్రకారం 4జీ వినియోగదారులు రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్ పొందేలా ఆఫర్‌ను రూపొందించినట్టు సమాచారం. అయితే, దీనిపై ఎయిర్‌టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.