గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)

భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

ప్రముఖ యాపిల్ సంస్థ ఐఫోన్ల విక్రయాన్ని భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఐఫోన్ విక్రయాలు భారత దేశంలో తక్కువగా వుండటమే. ముఖ్యంగా ఐఫోన్ 6 విక్రయాలను భారత్‌లో ఆపేయాలని యాపిల్ నిర్ణయించింది. అంతేగాకుండా 35శాతం కంటే తక్కువ విక్రయాలున్న ఐఫోన్‌లను రిటర్న్ తీసుకునేందుకు యాపిల్ సై అంటోంది. 
 
ఇంకా ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ల బేసిక్‌ల రేట్లు పెరిగే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత ఐఫోన్ కొనాలనుకునే వారి.. ఐఫోన్ 6ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఫోన్ల విక్రయాలను భారత దేశంలో ఆపేశారు. ఇంకా రేట్లు ఎక్కువగా వుండటంతో యాపిల్ ఐఫోన్లపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని సమాచారం.