బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (11:40 IST)

ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారా..?

ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారా..? అయితే బాధపడనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకోలేని తమ వినియోగదారులను దృష్టిలో వుంచుకుని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇకపై తమ దగ్గర ఉన్న ఏటీఎంలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. టెలికాం దిగ్గజం జియో బాటలో నడిచిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. 
 
అలాగే ఎయిర్‌టెల్ వినియోగారులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బిఐ, యాక్సిస్, సిటీ బ్యాంక్, డీసీబీ, ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టర్డ్‌ బ్యాంకుల ఏటీఎంలలో మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎంపిక చేసిన కొన్ని కిరాణా, ఫార్మసీ దుకాణాల్లో కూడా రీచార్జ్ చేసుకోవచ్చునని టెలికాం సంస్థలు ప్రకటించాయి.