సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (09:59 IST)

గూగుల్ నుంచి కొత్త స్కానింగ్‌ యాప్‌.. స్మార్ట్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

సెర్చ్ ఇంధనం.. గూగుల్ కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. బుధవారం నుంచే ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్‌ లేదా ఫొటోనైనా సులభంగా స్కాన్‌ చేసి స్మార్ట్‌ఫోన్లలో సేవ్‌ చేసుకునే ఫొటో స్కానింగ్‌

సెర్చ్ ఇంధనం.. గూగుల్ కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. బుధవారం నుంచే ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్‌ లేదా ఫొటోనైనా సులభంగా స్కాన్‌ చేసి స్మార్ట్‌ఫోన్లలో సేవ్‌ చేసుకునే ఫొటో స్కానింగ్‌ యాప్‌ను గూగుల్‌ విడుదల చేసింది. 
 
ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన ప్లాట్‌ఫాంలపై లభిస్తోంది. దీని ద్వారా తమ ఫొటోలు, డాక్యుమెంట్లను సులభంగా స్కాన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కాన్‌ చేసుకున్న ఫొటోలను ఒక ట్యాప్‌ ద్వారా గూగుల్‌ ఫొటోస్‌లోనూ సేవ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతే కాకుండా పర్సనల్ ఫొటోస్‌ను ప్రత్యేక భద్రత సదుపాయం కూడా ఉంది.
 
మన పాత ఆల్బమ్స్ ఉన్న ఫోటోలను, చిన్న వయస్సు మనం దిగిన ఫోటోలు ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి డిజిటల్‌ రూపంలో జాగ్రత్తగా దాచుకోవచ్చునని అని గూగుల్‌ సంస్థ వెల్లడించింది. మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్‌ డౌన్లోడ్ చేసుకోవచ్చునని గూగుల్ ప్రకటించింది.