శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (11:21 IST)

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్.. ఇక 2జీ, 3జీ ఫోన్లకు సైతం...

దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు జియో సేవలు కేవలం 4జీ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే

దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు జియో సేవలు కేవలం 4జీ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇకపై ఇవి 2జీ, 3జీ మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 
 
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇప్పటికీ 2జీ, 3జీ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు జియో ఈ నిర్ణయం తీసుకుంది. 2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా రిలయన్స్ జియో వివరణ ఇచ్చింది. సిమ్ తీసుకున్న తర్వాత జియోఫై అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత జియో 4జీ వాయిస్ అప్లికేషన్‌ను మీ 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని గంటల్లో సిమ్ యాక్టివేట్ కాగానే జియో ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, డేటా సేవలను పొందవచ్చు.
 
జియో నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించినంత వేగంగా డేటా సేవలను జియో అందించలేకపోతుందని పెదవి విరుస్తున్నారు. 4జీ ఫోన్లలోనే జియో డేటా సేవలు చాలా నెమ్మదిగా ఉంటే 2జీ, 3జీ ఫోన్లలో ఇంకెంత దారుణంగా ఉంటుందోనని సందేహిస్తున్నారు. అంతేకాకుండా జియో సిమ్ వేసిన దగ్గర్నుంచి ఫోన్ చార్జింగ్ వెంటనే తగ్గిపోతోందని కొందరు బాధపడుతున్నారు.