వీరబాదుడుకు సిద్ధమవుతున్న ఎయిర్‌టెల్ : ఆ ప్యాక్‌లన్నీ రద్దు

airtel
Last Updated: బుధవారం, 15 మే 2019 (13:11 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సంస్థ తన మొబైల్ ఖాతాదారులపై పెనుభారాన్ని మోపేందుకు సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, అనేక ప్యాక్‌లను రద్దు చేయాలని భావిస్తోంది. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ - యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులోభాగంగా రూ.499 కన్నా తక్కువగా ఉండే స్కీమ్‌లను తొలగించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఉండే రూ.749, రూ.999, రూ.1,599 స్కీమ్‌లను మాత్రమే సంస్థ కొనసాగిస్తుందని తెలుస్తోంది.

అంటే ఇప్పటికే రూ.299 పోస్ట్ పెయిడ్ స్కీమ్‌ను నిలిపివేసిన ఎయిర్‌టెల్, అతి త్వరలో రూ.349, రూ.399 ప్యాక్‌లనూ నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, ఇంతవరకూ తక్కువ ధరకే డేటాను పొందుతున్న ఎయిర్‌టెల్ సిమ్ కార్డు యూజర్ల జేబుపై మరింత భారం పడక తప్పదు. అయితే, ఇదే అంశంపై ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.దీనిపై మరింత చదవండి :