జియో 4జి ఫోన్ బుకింగ్స్ స్టార్ట్... రూ.1500 ఇప్పుడే కాదు... ఎప్పుడు?

దేశంలో జియో సృష్టించిన సంచలనం సంగతి తెలిసిందే. ఉచిత ఫోన్ అంటూ మరో సంచలనానికి తెర లేపిన జియో బుకింగ్స్ ఆగస్టు నెల 24 నుంచి ప్రారంభం కావాల్సి వుంది. కానీ అప్పుడే ఆఫ్ లైన్ బుకింగ్స్ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రిటెయిలర్ షాపులు ఇవాళే బుకింగ్స్ ప్

Jio-Phone
ivr| Last Modified సోమవారం, 14 ఆగస్టు 2017 (18:52 IST)
దేశంలో జియో సృష్టించిన సంచలనం సంగతి తెలిసిందే. ఉచిత ఫోన్ అంటూ మరో సంచలనానికి తెర లేపిన జియో బుకింగ్స్ ఆగస్టు నెల 24 నుంచి ప్రారంభం కావాల్సి వుంది. కానీ అప్పుడే ఆఫ్ లైన్ బుకింగ్స్ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని రిటెయిలర్ షాపులు ఇవాళే బుకింగ్స్ ప్రారంభించారు. ఆధార్ నెంబరు చెబితే చాలు... ఫోన్ బుక్ అయిపోతుంది. 
 
ఒక ఆధార్ నెంబరుకు ఒక్కటే ఫోన్. ఒకసారి బుక్ చేసుకున్నవారికి మరో ఫోన్ ఇవ్వరు. అలాగే తొలుత సంస్థ ప్రకటించినట్లుగా రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఫోన్ బుకింగ్ సమయంలో కట్టనవసరం లేదు. ఫోన్ డెలివరీ అయ్యాక డబ్బును చెల్లించవచ్చు. 
 
ఫోన్ బుక్ చేసిన తర్వాత దాని స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా ఓ టోకెన్ ఇస్తారు. అందులోని నెంబర్ ఎంట్రీ చేసుకుని ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కాగా ఫోన్లను వచ్చే సెప్టెంబరు నెల నుంచి బుక్ చేసుకున్నవారికి అందించేందుకు జియో ప్రయత్నం చేస్తోంది.దీనిపై మరింత చదవండి :