సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (17:54 IST)

వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్: చైనాలో జనవరి 4న విడుదల

One plus
One plus
వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ జనవరి 4న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్.. కొత్త స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసితో పనిచేస్తుందని కంపెనీ ధృవీకరించింది.  
 
వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లతో పాటు కొత్త కలర్ ఆప్షన్లను విడుదల చేసింది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.  వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ జనవరి 4 న చైనాలో లాంచ్ అవుతుందని వన్ ప్లస్ ధృవీకరించింది. 
 
అలాగే వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ కూడా ఫిబ్రవరి 7 న భారతదేశంలోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది, దీనికి 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సార్ ఉంది. 
 
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 32 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉండనుంది. వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని టాక్ వస్తోంది.