మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (14:42 IST)

ట్విట్టర్‌పై హ్యాకింగ్ పంజా ... అంగట్లో 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు

twitter
మైక్రో మెస్సేజింగ్ యాప్ ట్విట్టర్‌పై హ్యాకర్లు పంజా విసిరారు. ఏకంగా 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను వారు తస్కరించారు. ఈ బాధితుల్లో గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈ సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
 
ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నంబర్లను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజీ అని హడ్సన్ రాక్ తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం 5.4 మిలియన్ ట్విట్టర్ ఖాతాలు డేటా హ్యాకర్ల పాలైన విషయం తెల్సిందే.