గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (12:28 IST)

వైఫై తర్వాతే శృంగారం.. నెటిజన్ల మనోగతం... సర్వేలో వెల్లడి

నెటిజన్ల మనోభావాలపై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిత్యజీవితంలో శృంగారం కంటే వైఫైనే ముఖ్యమని నెటిజన్లు తేల్చిచెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లలో 40 శాతం మంది వైఫైకి ఓటు వేయ

నెటిజన్ల మనోభావాలపై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిత్యజీవితంలో శృంగారం కంటే వైఫైనే ముఖ్యమని నెటిజన్లు తేల్చిచెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లలో 40 శాతం మంది వైఫైకి ఓటు వేయగా, 37 శాతం మంది శృంగారానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. 
 
నేటి ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో వైఫై వినియోగం ఎంతగా పెరిగిపోయిందంటే.. మానవ జీవితంలో ఇతర అవసరాలకంటే ఇదే ముందుంది అనడం అతిశయోక్తి కాదేమో. ఈ వైఫై వినియోగంపై 'ఐపాస్‌' అనే గ్లోబల్‌ మీడియా కనెక్టివిటీ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 
 
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తమకు ఇష్టమైన చాక్లెట్లు, ఆల్కహాల్‌, చివరకి శృంగారానికంటే ఎక్కువ ప్రాధాన్యత వైఫైకే ఇస్తున్నారట. 1700 మందిపై తాజాగా సర్వే నిర్వహించింది. ఇందులో 40 శాతం మంది తమ రోజువారి అవసరాల్లో వైఫై అతి ముఖ్యమైనది పేర్కొన్నారు. 37 శాతం మంది శృంగారానికి ఓటు వేయగా.. 14 శాతం మంది చాక్లెట్లు, 9 శాతం మంది ఆల్కహాల్‌ అత్యంత ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.