గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:41 IST)

రియల్ మి 9 సిరీస్ 5G ఫోన్.. ఫీచర్స్ లీక్ ధర రూ.18,999?

realme 5 G
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్ మి 9 సిరీస్ 5G ఫోన్ రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. దీనిబట్టి రియల్ మి 9 సిరీస్ నుంచి 5G స్మార్ట్ ఫోన్ కూడా రానున్నట్టు పాపులర్ టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
 
ఇప్పటికే మొదటి రెండు సిరీస్ ఫోన్లకు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించినప్పటికీ మూడోది 5G Realme 9 5G ఫోన్ రానున్నట్టు రియల్ మి కంపెనీ రివీల్ చేయలేదు. అయితే ముందుగా, Realme 9 Pro Realme 9 Pro+ సిరీస్ ఫీచర్లు, ధరలు లీకయ్యాయి. 
 
లీకైన డేటా ప్రకారం.. Realme 9 Pro ధర రూ. 18,999గా ఉంది. భారత మార్కెట్లో Realme 9 Pro+ ధర రూ. 24,999గా ఉండనుంది. Realme 9 Pro, Realme 9 Pro Plus ఫిబ్రవరి 16న భారత మార్కెట్లో లాంచింగ్ రెడీ కానుంది.
 
Realme 9 5G స్పెసిఫికేషన్స్ అంచనా :
Realme 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్‌తో రానుంది. 
Realme 8 5Gకి పవర్ డైమెన్సిటీ 700 కంటే అప్‌గ్రేడ్ గా రానుంది.
ప్రాసెసర్ గరిష్టంగా 8GB RAM 128GB ఇంటర్నెట్ స్టోరేజీతో రావొచ్చు. 
6GB RAM, 64GB స్టోరేజీ కాన్ఫిగరేషన్, 8GB RAM, 128GB స్టోరేజీ మోడల్‌తో రావొచ్చు. 
Realme 9 5G Android 12-ఆధారిత Realme UI 3.0తో రావచ్చు. 
ఈ డివైజ్ ముందు భాగంలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో రానుంది.
Realme 9 5G కెమెరాలలో 48MP మెయిన్ సెన్సార్, 2-MP డెప్త్ సెన్సార్, వెనుకవైపు 2-MP మైక్రో సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీల కోసం.. 16-MP కెమెరా ఉండవచ్చు.