గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (08:28 IST)

పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చట

పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన ప్రజలకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ఇందులో డబ్బులు పెడితే చాలా రకాల లాభాలని పొందొచ్చు. పైగా దీని వలన రిస్క్ కూడా ఉండదు. 
 
వివరాల్లోకి వెళితే.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో కనుక డబ్బులు పెడితే అవి కచ్చితంగా డబ్బులు రెట్టింపు అయ్యిపోతాయి. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకం పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలని కూడా పొందొచ్చు.
 
అయితే ఇందులో డబ్బులు రెట్టింపు అవ్వాలంటే 10 ఏళ్ల 4 నెలలు ఉంచాలి. అప్పుడు మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 124 నెలలనమాట. మీరు రూ.1000 నుంచి డబ్బులు ఈ స్కీమ్‌లో పెట్టచ్చు. 
 
రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి గమనించండి. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అనేది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇందులో చేరచ్చు.