శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (19:51 IST)

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు.. ఏంటవి?

మెస్సేజింగ్‌ యాప్‌గా వాట్సాప్‌ పోటీదారులైన సిగ్నల్‌, టెలిగ్రామ్‌కు దీటుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సాప్‌ అలరిస్తూనే ఉంటోంది. ఆటో-డిజప్పియరింగ్‌ మెసేజెస్‌, వ్యూ వన్స్‌, జాయిన్‌ నౌ వంటి ఫీచర్లను ఇటీవల తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫీచర్లను మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.
 
వాట్సాప్‌ స్టిక్కర్‌ సజెషన్‌, లింక్‌ ప్రెవ్యూని విడుదల చేసింది. తద్వారా చాట్‌ అనుభవం మరింత మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు వీటిని ఉపయోగించుకునేందుకు వీలుగా గైడ్‌ను కూడా విడుదల చేసింది.
 
అలాగే సోషల్‌ మీడియా, లింక్స్‌ షేరింగ్‌ అనేది ఇప్పుడు కలిసిమెలిసి చేసే పనులుగా మారిపోయాయి. ఏదైనా లింక్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినప్పుడు గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రీవ్యూ సమాచారం అందుబాటులోకి వచ్చింది. అంటే లింక్‌ చేయడానికి ముందే ముఖ్యమైన సమాచారం రీడర్‌కు తెలుస్తుంది.
 
ఇకపోతే స్టిక్కర్లు లేకుండా సంభాషణలు అంటే బోరు కొట్టడం ఖాయం. టెక్స్ట్‌కు స్టిక్కర్లు మరింత సొబగులు అద్దుతాయి. అయితే మ్యాచ్‌ అయ్యే స్టిక్కర్‌ ఒక్కోసారి లభించకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ ఫీచర్‌తో చాలా వేగంగా అవసరమైన స్టిక్కర్‌ను పొందవచ్చు. సంబంధిత స్టిక్కర్లను కూడా అదే సమయంలో చూపుతుంది.