గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (22:37 IST)

జూమ్ యాప్ నుంచి కొత్త ఫీచర్.. 12 భాషల్లోకి లైవ్ ట్రాన్స్​లేషన్

పాపులర్​ వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్​ జూమ్​ తాజాగా ఓ కొత్త ఫీచర్​ను ప్రకటించింది. జూమ్ కాల్స్ కోసం రియల్ టైమ్, మల్టీ-లాంగ్వేజ్ ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను త్వరలోనే జోడిస్తున్నట్లు ప్రకటించింది. వర్చువల్​ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ఈ కొత్త ఫీచర్​ పనిచేస్తుందని తెలిపింది.
 
విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే ఈ ఫీచర్​ వెసులు బాటు కల్పించనుంది. వీడియో కాల్స్​ సమయంలో వేర్వేరు భాషలకు చెందిన వారు ఇబ్బంది లేకుండా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు గాను ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 
 
ఎదుటి వ్యక్తి మాట్లాడుతుండగానే మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్​లేట్​ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు గాను జర్మనీకి చెందిన కైట్స్​ అనే సంస్థను జూమ్​ కొనుగోలు చేసింది. కైట్స్​కు సంస్థలకు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్​ మీటింగ్స్​ను మరింత సులభతరం చేయనున్నామని జూమ్​ చెబుతోంది.
 
ఈ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ఈ ఫీచర్​ ద్వారా మొత్తం 12 భాషల్లో లైవ్​ ట్రాన్స్​లేషన్​ చేసుకోవచ్చు. అయితే ఏయే భాషలకు మద్దతిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.