శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (12:33 IST)

రిలయన్స్ జియో ‌4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ ఆన్‌లైన్‌లో లీక్.. స్పెసిఫికేషన్స్ ఇవే....

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 4జీ టెక్నాలజీతో దేశీ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 4జీ టెక్నాలజీతో దేశీ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఇపుడు అతి తక్కువ ధరకు 4జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఫోనుకు సంబంధించిన ఫీచర్లు ఇపుడు ఆన్‌లైన్‌లో లీక్ కాగా, ఈ వార్త సంచలనంగా మారింది. 
 
గ్రామీణ భారతావనిలోని అపారమైన మార్కెట్‌పై కన్నేసిన ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు. అన్ని జియో యాప్స్, 4జీ సిమ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే, అతి తక్కువ ధరకు కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి. 
 
వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సదుపాయాలుంటాయి. మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ తదితరాలకు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. రెండు మోడల్స్‌లో ఇవి లభ్యం కానుండగా, వీటి ధరలు రూ.1700 వరకూ ఉండగా, తొలి దశలో సబ్సిడీపై రూ.999 నుంచి రూ.1,500 మధ్య విక్రయించాలని రిలయన్స్ అధినేత భావిస్తున్నారు.