రిలయన్స్ జియో మరో బెస్ట్ ఆఫర్.. బై వన్ గెట్ వన్

రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉ

jio prime offer
pnr| Last Updated: ఆదివారం, 5 మార్చి 2017 (13:15 IST)
రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంది. వీరికి యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది.

ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇదేం కొత్త ఆఫర్ అనుకుంటున్నారా. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన యూజర్లు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ప్యాక్‌తో లభించే డేటాతో పాటు 201 రూపాయల విలువ చేసే 5జీబీ అదనపు డేటా లభిస్తుంది.

అలాగే, 499 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే, 301 రూపాయల ఖరీదైన 10జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అయితే మార్చి 31 2017 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదనపు లాభాలు వర్తిస్తాయి.దీనిపై మరింత చదవండి :