ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (11:03 IST)

జియో పేమెంట్‌ బ్యాంకుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. గూగుల్ డ్రైవ్ ద్వారా 50ఎంబీల వరకు?

పెద్ద నోట్ల రద్దు తర్వాత పేమెంట్ బ్యాంకులకు అనుమతులు ఇస్తున్న ఆర్బీఐ తాజాగా జియో పేమెంట్ బ్యాంకుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియాపోస్టులు ఉన్న సంగతి తెలిసిందే.

పెద్ద నోట్ల రద్దు తర్వాత పేమెంట్ బ్యాంకులకు అనుమతులు ఇస్తున్న ఆర్బీఐ తాజాగా జియో పేమెంట్ బ్యాంకుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో ఎయిర్‌టెల్, పేటీఎం, ఇండియాపోస్టులు ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారతీయ స్టేట్‌బ్యాంక్ భాగస్వామ్యంతో ఈనెలాఖరులోపే సర్వీసులు ప్రారంభించేందుకు జియో సిద్ధమవుతోంది. ఇప్పటికే టెలికం రంగంలో సంచలనాలకు తెరలేపిన జియో.. పేమెంట్ బ్యాంకుపై ప్రస్తుతం అందరి దృష్టి మళ్లింది. 
 
ఇదిలా ఉంటే.. 'క్లౌడ్‌' ఫైల్‌ షేరింగ్‌ సర్వీసుల అందిస్తున్న గూగుల్‌ డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్‌ వన్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ సాయంతో ఇకపై 50 ఎంబీల వరకు ఫైలును పంపొచ్చునని గూగుల్ తెలిపింది. ఈ వారం నుంచి జీమెయిల్‌ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్‌ వెల్లడించింది. గూగుల్‌ డ్రైవ్‌ లింక్‌ ద్వారా ఎంతటి పెద్ద ఫైలునైనా (50 ఎంబీల వరకు) షేర్‌ చేసుకోవచ్చునని తెలిపింది.