గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (16:45 IST)

జియో నుంచి కొత్త JioTV ప్రీమియం ప్లాన్స్

Jio
ప్రముఖ టెలికాం బ్రాండ్ జియో కొత్త JioTV ప్రీమియం ప్లాన్‌లను ప్రారంభించింది. ఇది వివిధ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌లు వ్యక్తులు వేర్వేరు యాప్‌ల నుండి సినిమాలను పొందడం చాలా సులభం చేస్తాయి. ఇందులో రూ.398లకు ప్రజలు ఆన్‌లైన్‌లో వివిధ ప్రదేశాల నుండి వినోదాన్ని పంచుతుంది. 
 
ఈ ప్లాన్‌లతో, ఇకపై ప్రతి యాప్‌కు ప్రత్యేక సభ్యత్వాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వివిధ యాప్‌ల నుండి మీకు కావలసిన అన్ని అంశాలను ఒకే చోట పొందవచ్చు. 
 
Jio TV కొత్త ప్రీమియం ప్లాన్‌లు రూ.398 నుండి ప్రారంభమవుతాయి. ఇది 28 రోజులు వ్యాలీడిటీని కలిగివుంటాయి. అలాగే రూ.1198 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. రూ.4498 ప్లాన్ 365 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. 
Jio TV
Jio TV
 
చౌకైన ప్లాన్‌లో 2GB డేటాతో 12 ఐటీటీ యాప్‌లకు యాక్సెస్ ఉంది. ఇతర ప్లాన్‌లలో 2GB డేటాతో 14 OTT యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. అదనంగా మీరు వార్షిక ప్రణాళికలో కొన్ని ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.