బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 5 జనవరి 2025 (18:17 IST)

Vi సూపర్‌హీరో పథకం, ఏడాదంతా ప్రతిరోజూ 12 am-12 pm వరకు అపరిమిత డేటా

vodafone plans
పరిశ్రమలో మొదటిసారిగా “సూపర్‌హీరో” పథకాన్ని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi తీసుకువచ్చింది, ఇది 12 AM నుండి 12 PM మధ్య అపరిమిత డేటాను వినియోగించుకునే అవకాశం అందిస్తుంది. అధిక-వేగవంతమైన డేటా కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది రూపొందించబడింది. వార్షిక ప్యాక్‌లు లేదా మనీ ఆఫర్‌ల కోసం వెతుకుతున్న కస్టమర్‌ల కోసం మరింత ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకురావటంలో భాగంగా Viలో మూడు అత్యుత్తమ విలువ కలిగిన వార్షిక రీఛార్జ్ అవకాశాలను తీసుకువచ్చింది. ఇవి నెలవారీ ప్లాన్‌లతో పోలిస్తే 25% అదనపు ఆదా చేయటంతో పాటుగా సంవత్సరమంతా వినోదం, నిరంతరాయ మొబైల్ డేటా అవసరాలను కూడా తీర్చగలవు. 
 
Vi యొక్క వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు రోజులో మిగిలిన 12 గంటల పాటు 2GB రోజువారీ డేటా కోటాతో పాటు 12 AM నుండి 12 PM వరకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తాయి. అంతేకాదు, Vi సూపర్ హీరో ప్యాక్‌లు వీకెండ్ డేటా రోల్‌ఓవర్‌ను కూడా అందిస్తాయి. వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయడానికి, వారాంతంలో దాన్ని ఉపయోగించడానికి ఇది అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌లు డేటా డిలైట్ ఫీచర్‌తో అత్యవసర డేటా టాప్-అప్‌ను కూడా అందిస్తాయి. ఇది నెలకు రెండుసార్లు షరతులు లేని అదనపు 1GB డేటాను అందిస్తుంది. వీటన్నిటితో, Vi యొక్క వార్షిక సూపర్ హీరో ప్యాక్‌లు సాటిలేని విలువను అందించడానికి రూపొందించబడ్డాయి.
 
ఈ ప్రయోజనాలతో పాటు, వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లైట్ వంటి ఓటిటి సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పూర్తి సంవత్సరం పాటు ఆనందించవచ్చు. రోజుకు రూ. 10 కంటే తక్కువ ధరతో, Vi యొక్క వార్షిక సూపర్‌హీరో ప్యాక్‌లు నెలవారీ రీఛార్జ్‌లతో పోల్చినప్పుడు 25% పొదుపులను అంటే దాదాపు రూ.1100 కంటే ఎక్కువ ఆదా చేస్తాయి.