సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:30 IST)

3 నుంచి వొడాఫోన్ చార్జీల బాదుడు... 43 శాతం పెంపు

దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ గతంలో ప్రకటించినట్టుగానే మొబైల్ చార్జీలను భారీగా పెంచనుంది. ఈ పెంపు ఏకంగా 43 శాతం మేరకు ఉండనుంది. పైగా, పెంచిన ధరలు ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఇటీవల వొడాఫోన్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో వొడాఫోన్ ఇండియా లిమిటెడ్ ప్రీపెయిడ్ కొత్త టారిఫ్‌లు, ప్లాన్లు ప్రకటిస్తోంది. అన్నీ ప్లాన్లు దేశవ్యాప్తంగా ఈ నెల మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ ప్రకారంగా ఇపుడు కొత్త టారిఫ్‌లను ప్రకటించింది. 
 
ఈ టారిఫ్‌ల ప్రకారం కొత్త ధరల్లో 43 శాతం మేరకు పెరుగుదల కనిపించింది. అన్‌లిమిటెడ్ విభాగంలో 2, 28, 84, 365 రోజుల కింద సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్లాన్లను పోల్చినపుడు కొత్త ప్లాన్ల ధరల్లో 41.2 శాతం మేరకు పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్‌లిమిటెడ్ ప్లాన్ల స్థానంలో డిసెంబరు మూడో తేదీ నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. 
 
కాగా, రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితితో ఉన్న ప్లాన్ ధర ప్రస్తుతం రూ.458గా వుండగా, దీన్ని రూ.599కి పెంచింది. అంటే ఈ ప్లాన్ ధరను 31 శాతం మేరకు పెంచారు. అలాగే, రూ.199 ప్లాన్ ధరను రూ.249, 365 రోజుల ప్లాన్ ధరను రూ.1699 నుంచి రూ.2399కి పెంచారు.