షియోమీ 4కె అల్ట్రా హెచ్.డి టీవీ.... 16జీబీ స్టోరేజ్
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల్లో సంచలనాలకు కేంద్రంగా మారిన చైనాకు చెందిన షియోమీ తాజాగా 65 అంగుళాల హెచ్.డి.ఆర్. టీవీని విడుదల చేసింది. ఈ టీవీ 4కె అల్ట్రా హెచ్.డి ఎంఐ టీవీ. దీన్ని తొలుత చైనా మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగింది. ఈ టీవీ ధర రూ.63,300 మాత్రే.
ఈ 4కె టీవీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమర్చగా, డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే భారత మార్కెట్‌లో ఈ టీవీని షియోమీ ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.