శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (14:44 IST)

భారత్‌లో యాహూ వార్తా సేవలు బంద్..

భారత్‌లో యాహూ సేవల్లో వార్తలు కూడా ముఖ్యమైన అంశం. గత రెండు దశాబ్దాలుగా యాహూ న్యూస్ పేరిట వార్తలు అందిస్తోంది. అయితే, ఈ ఐటీ దిగ్గజం తాజాగా తన వార్తా సేవలు నిలిపివేసింది.
 
గురువారం నుంచి యాహూ న్యూస్‌కు స్వస్తి పలుకుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూ‌లో ఎలాంటి తాజా కంటెంట్‌ను పోస్టు చేయలేదు. 
 
అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని యాహూ వెల్లడించింది. తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది.
 
యాహూ తాజా నిర్ణయానికి భారత కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 
 
డిజిటల్ మీడియా సంస్థల్లో విదేశీ సంస్థల పెట్టుబడులను 26 శాతం వరకే అనుమతిస్తుండడం యాహూ వెనుకంజకు కారణంగా తెలుస్తోంది. దానికితోడు విదేశీ మీడియా సంస్థలపై బారత నియంత్రణ చట్టాల ప్రభావం అధికం కానుంది.