బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (15:39 IST)

స్మృతి ఇరానీకి షాకిచ్చిన మధ్యప్రదేశ్ ఓటర్లు

కేంద్ర మంత్రి, బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీకి మధ్యప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఈ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉండేది. 
 
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా? అని ప్రజలను ప్రశ్నించింది. తమకు రుణమాఫీ అయిందని ప్రజలు ముక్త కంఠంతో చెప్పడంతో స్మృతి ఇరానీ ఖంగుతిన్నారు. 
 
మాఫీ అయింది… అయింది అంటూ ప్రజలు గట్టిగా చెప్పడంతో స్మృతి ఇరానీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం అశోక్‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ పాల్గొన్న సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ట్విటర్‌లో పోస్టు చేశారు. బీజేపీ నేతల అబద్ధపు ప్రచారానికి ప్రజలే నేరుగా సమాధానం చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.