సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (19:10 IST)

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Priyanka Chopra
Priyanka Chopra
కథానాయికలు సినిమా షూటింగ్ కు వస్తే వారి వెంట తల్లి, దండ్రులు, అన్న, ప్రియుడు ఇలా ఎవరో ఒకరు ఉంటారు. సినిమా కథ చెప్పాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. కాని ఓ దర్శకుడు కథ చెప్పడానికి తన కుమార్తెను ఒక్కదానినే రమ్మన్నాడని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ప్రియాంక తల్లి ఆరోపణ చేసింది. వెంటనే సోషల్ మీడియాలలో వైరల్ అయింది. అందరు, ఎవరా దర్శకుడు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు.
 
ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అనేక సార్లు కాస్టింగ్ కౌచ్ ఘటనలు పేస్ చేసిందని తల్లి చెప్పింది. నటిగా ఎదిగాక హాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసింది.  లేటెస్ట్ గా రాజమౌళి-మహేశ్ బాబు కాంబి నేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ టైములో ఇలా ఆమె తల్లి కామెంట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంకకు ఆ  సంఘటన జరిగింది టాలీఉడ్డా, బాలీ ఉడ్డా? చెప్పాలని కొందరు తెలిపారు.  ప్రియాంక ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తాను కూడా ఆమెతో పాటు సెట్స్ లో ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.  మా అమ్మ లేకుండా కథ చెబుతానంటే నేను సినిమా చేస్తానని ఎలా అనుకున్నారు అంటూ వెంటనేతిరిగి  వచ్చేసిందని ప్రియాంక చోప్రా తల్లి అన్నారు.