కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..?

శుక్రవారం, 22 మార్చి 2019 (15:53 IST)
మోడ్రన్ స్టైల్.. మోడ్రన్ స్టైల్ అంటే ప్రస్తుతం వస్తున్న ఫ్యాషన్ గురించి ఆలోచించకండి. ఇదివరకటి వస్త్ర ఫ్యాషన్‌ను కూడా లేటెస్ట్ ట్రెండ్‌గా ఇప్పటి యువత పాటిస్తోంది. మీరు నిజంగానే యువకులైతే యువకులలాగానే వుండాలి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. మీ అలవాట్లు, మీ మాటల వలన మీ మిత్రులకు, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి. 
 
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు.. మీ కళ్ళు మీ మనసును తెలుపుతుంది. మీ చూపులతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి. ఇది ప్రేమకు ఇబ్బందికర పరిణామానికి దారితీస్తుంది. ముఖ్యంగా కన్నుల భాషను తెలుసుకోండి. అందులో అమ్మాయిలైతే చాలా జాగ్రత్తగా వుండాలంటున్నారు పరిశోధకులు. ఈ కన్నుల భాషను మీరు నేర్చుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆ కళ్ళు మిమ్మల్ని మోసం చేయవు అని మీకు నమ్మకం కలిగితే మీరు ప్రేమలో పడొచ్చంటున్నారు. 
తొలి కలయిక.. మొట్ట మొదటి కలయిక చాలా ఆందోళన, అమితమైన ఉత్సాహంగానూ వుంటుంది. ఇది తొలి అడుగుగా భావించాలి. ఈ తొలి కలయికతో ఎవరు ఎలాంటి కోరికతో వస్తున్నారో కూడా తెలిసిపోతుందంటున్నారు పరిశోధకులు. 
 
కొత్త కొత్తగావున్నది... ప్రతి ప్రియునికి ప్రియురాలికి వారి తొలి కలయికలో కొత్తదనం వుంటుంది. మీరు మాట్లాడే మాటలు మృదువుగానూ మనసుకు హత్తుకునేదిగానూ వుండాలి. మాటలు కాస్త పెంచాలనుకుంటే చివరిమాటను కలుపుతూ వేరొక విషయాన్ని జోడించి మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిలో ఆసక్తి కలిగేలావుండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మనసును ఆహ్లాద పరిచేదిగా వుండాలి. 
 
అందులో హాస్యం కూడా మిళితమైవుండాలి. ఆ తర్వాత మీ గురించి తెలపాలి. మీ గురించి తెలిపిన తర్వాత వారిగురించి అడగండి. ఇద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకునేదిగావుండాలి మీ మాటలు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి అనువైన సమయాన్ని తెలుసుకోండి. అటువైపు కూడా ప్రేమకు మార్గం సుగమం అయ్యేలా వున్నప్పుడే మీరు మీ మనసులోని మాటను వ్యక్తపరచడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో ఇద్దరి మధ్య అవగాహన వుంటుంది, కాని మీ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం మానకూడదు.

అన్నీ చూడండి

25 సార్లు సిట్-అప్స్ స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి.. పీటీ టీచర్‌కు మెమోలు

పాఠశాలకు పెద్ద కత్తి, చాకుతో వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు, పిల్లలు బెంబేలు, వీడియో

సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా

2035 నాటికి బయోఎకానమీ పవర్‌హౌస్‌గా భారతదేశం

చారిత్రాత్మక విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments