బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (20:10 IST)

వాంతులొస్తున్నాయని కిటికీల వైపు తలపెట్టిన బాలిక.. బంతిలా ఎగిరిపడిన తల..!

సాధారణంగా ప్రయాణాలు చేస్తుంటే వాంతులు వస్తే బస్సు కిటికీల వైపు తలపెట్టేస్తుంటాం. అలా పెట్టడంతో మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. వాంతులు రావడంతో బస్సు కిటికీలో తల బయటకు పెట్టిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ పాప తల మొండెం తెగిపడింది.

ఈ ఘటన ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేగాకుండా.. కళ్ల ముందు కుమార్తె మృతదేహం చూసీ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్‌ వద్ద ఇండోర్‌-ఇచ్చాపూర్‌ రహదారి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. సోదరి, తల్లితో కలిసి ఇండోర్ వెళ్లేందుకు 13 ఏళ్ల బాలిక బస్సు ఎక్కింది. బస్సు రోషియా ఫేట్‌కు చేరుకోగానే వాంతులు వచ్చాయి. దీంతో తల్లి వెంటనే బాలికను బస్సు కిటికీలో తల పెట్టించింది. అయితే ఈలోపు అవతలి వైపు నుంచి దూసుకుంటూ వచ్చిన టక్కు పాప తలను వేగంగా ఢీకొట్టింది. దీంతో పాప మొండెం, తల వేరుపడింది. 
 
బంతిలా బాలిక తల ఎగిరిపడడంతో ఈ ఘటన చూసిన వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని లబోదిబోమని రోదించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.