శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (18:28 IST)

కిటికీల నుంచి జారిపడిన 14 నెలల బాలుడు.. చెట్టుకొమ్మకు చిక్కుకుని?

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ముంబై శివారు ప్రాంతంలో 14 నెలల బాలుడు నాలుగో అంతస్థు నుంచి జారిపడిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో కోవాండి శివారు ప్రాంతంలో అధర్వ అనే 14 ఏళ్ల పిల్లాడి కుటుంబం నివసిస్తోంది. అధర్వ ఆడుకుంటూ నాలుగో అంతస్థు కిటికీల నుంచి జారిపడటంతో చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు. 
 
ఆపై 14 నెలల బాలుడిని సహాయక సిబ్బంది కాపాడింది. కానీ పిల్లాడి పెదవులు, కాలుకు బలమైన గాయం ఏర్పడింది. చెట్టుకొమ్మకు చిక్కుకుపోవడంతో ప్రాణాపాయం నుంచి ఆ బాలుడు గట్టెక్కాడని వైద్యులు చెప్తున్నారు. 
 
ప్రస్తుతం ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో అధర్వ చికిత్స పొందుతున్నాడు. అతనికి ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ  బాలుడి ఆరోగ్యం నిలకడగా వున్నప్పటికీ కాలేయం ప్రాంతంలో బలమైన గాయం ఏర్పడటంతో అతనిని తీవ్ర చికిత్సను అందించాలని వైద్యులు చెప్తున్నారు.